గ్లోబల్‌ సమ్మిట్‌లో భారీ డ్రోన్‌ షోకు గిన్నిస్‌ రికార్డు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌ ముగింపు వేడుకలో ఏర్పాటు చేసిన భారీ డ్రోన్‌ షో ఆకట్టుకుంది. తెలంగాణ రైజింగ్‌-2047 లక్ష్యాలు, తెలంగాణ ఇజ్‌ రైజింగ్‌.. కమ్‌ జాయిన్‌ ది రైజ్‌ అనే థీమ్‌తో భారీ డ్రోన్‌ షో అట్టహాసంగా నిర్వహించారు.

గిన్నిస్‌ బుక్‌ రికార్డు సాధించేలా 3 వేల డ్రోన్‌లతో ప్రత్యేక ప్రదర్శన నిర్వహించారు. 2034 వరకు 1 ట్రిలియన్‌ ఎకానమీగా, 2047 వరకు 3 ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీనే లక్ష్యమని డ్రోన్లతో ప్రదర్శించారు.

కాగా ఈ డ్రోన్‌ షో, బాణసంచా ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. గతంలో అబుదాబిలో 2,131 డ్రోన్ల ప్రదర్శనకు గిన్నిస్‌బుక్‌ రికార్డు వరించింది. దానిని అధిగమించేలా 3 వేల డ్రోన్లతో రాష్ట్ర ప్రభుత్వం డ్రోన్‌ ప్రదర్శన ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి హాజరైన గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు సభ్యులు సీఎం రేవంత్‌రెడ్డికి ధ్రువపత్రాన్ని అందజేశారు. అయితే డ్రోన్ల భద్రత కోసం రాడార్‌ వ్యవస్థను ఏర్పాటు చేశారు.

Leave a Reply