Special Shows | శివ‌రాత్రికి స్పెష‌ల్ మిడ్ నైట్ షోలు ర‌ద్దు !

శివరాత్రికి స్పెషల్ గా ప‌లు థియేట‌ర్ల‌లో మిడ్ నైట్ షోలు ప్ర‌ద‌ర్శించడం దశాబ్దాలుగా ఏపీ, తెలంగాణల్లో ఆనవాయితీగా వస్తోంది. శివుని నామస్మరణ చేసుకుంటూ, జాగరణ చేసేవారికి ఈ సినిమాలు కాలక్షేపంగా ఉంటాయి.

ప్రతి శివరాత్రికి స్టార్ హీరోల పాత సినిమాలను రీరిలీజ్ కి పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తారు. ఈ ఏడాది కూడా అలాగే ప్లాన్ చేసి అడ్వాన్స్ బుకింగ్స్ మొదలుపెట్టగా.. హౌస్ ఫుల్ కూడా అయ్యాయి.

అయితే, పుష్ప సినిమా ఎఫెక్ట్ కారణంగా.. ఈ శివరాత్రి స్పెషల్ షోలను రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌లో గ్రాండ్‌గా ప్లాన్‌ చేసిన గుంటూరు కారం, దేవర, రెబల్‌ మిడ్‌నైట్‌ షోలు రద్దయ్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *