Drug Case | డ్రగ్స్ వద్దు బ్రో.. సైకిల్ తొక్కు బ్రో..

Drug Case | డ్రగ్స్ వద్దు బ్రో.. సైకిల్ తొక్కు బ్రో..

Drug Case | గుంటూరు, ఆంధ్రప్రభ : ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా, గుంటూరు జిల్లా పోలీస్ ఈగల్ విభాగం సంయుక్తంగా “డ్రగ్స్ వద్దు బ్రో – సైకిల్ తొక్కు బ్రో” సైకిల్ ర్యాలీని ఈ రోజు నిర్వహించారు. నల్లపాడు పోలీస్ స్టేషన్ సమీపంలోని టిడ్కో గృహాల వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ స్వర్ణభారతి నగర్, JKC రోడ్, గుజ్జనగుండ్ల సర్కిల్, స్వామి థియేటర్, TJPS కాలేజీ, పట్టాభిపురం ఫ్లైఓవర్ మీదుగా పోలీస్ పరేడ్ మైదానం(Police Parade Ground)లో ముగిసింది.

సుమారు 500 మంది విద్యార్థులు, సైక్లిస్టులు, అధికారులు, ప్రజలు పాల్గొన్న ఈ ర్యాలీకి ప్రజల్లో విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ, జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారీయా, ఎస్పీ వకుల్ జిందాల్, మున్సిపల్ కమిషనర్ పులి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

ఈగల్ ఐజీ రవికృష్ణ మాట్లాడుతూ.. అవగాహన లేకుండా సరదా కోసం డ్రగ్స్ వినియోగించే యువత జైలు పాలవుతున్నారని, కుటుంబాలు తీవ్ర ఆవేదనకు గురవుతున్నాయని హెచ్చరించారు. NDPS చట్టం కఠినమైనదని, ఒక్కసారి డ్రగ్స్ కేసు(Drug Case)లో పట్టుబడితే 10–20 సంవత్సరాల జైలు శిక్ష, ఉద్యోగ నష్టం, విదేశీ అవకాశాలు కోల్పోవడం వంటి తీవ్రమైన పరిణామాలు ఉంటాయని వివరించారు.

యువత తప్పు దారిలోకి వెళ్లకుండా తల్లిదండ్రుల పర్యవేక్షణ కీలకమని, కొద్దిపాటి అనుమానం వచ్చిన వెంటనే 1972 టోల్‌ఫ్రీ నెంబర్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు.

కలెక్టర్ తమీమ్ అన్సారీయా మాట్లాడుతూ.. డ్రగ్స్ వల్ల ఉత్పన్నమయ్యే అనర్ధాల పై ప్రభుత్వం విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు. సరదాగా మొదలయ్యే డ్రగ్స్ వినియోగం క్రమంగా వ్యసనంగా మారి జీవితాన్ని నాశనం చేస్తుందని హెచ్చరించారు. ఫిట్ ఇండియా ఉద్యమంలో భాగంగా సైకిల్(bicycle) తొక్కడం శారీరకంగా, మానసికంగా ఆరోగ్యాన్ని కాపాడి వ్యసనాలకు దూరంగా ఉంచుతుందని ఆమె చెప్పారు.

ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ.. గంజాయి, మాదకద్రవ్యాలు మొదట కిక్ కోసం మొదలైనట్లు అనిపించినా, చివరికి జీవితాలను చిత్తు చేస్తాయని పేర్కొన్నారు. డ్రగ్స్ వినియోగం(Drug Use), విక్రయం పై కఠిన చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.

ఈగల్ ఎస్పీ నగేష్ బాబు మాట్లాడుతూ… మాదకద్రవ్యాలు సమాజాన్ని బలహీనపరచే ప్రధాన సమస్యగా మారాయని, ప్రజలందరూ కలసి పని చేస్తేనే వాటిని అరికట్టగలమని చెప్పారు. టిడ్కో గృహాల వద్ద, స్వర్ణభారతి నగర్, TJPS కాలేజీ కేంద్రాల్లో అవగాహన సమావేశాలు జరిపి, ప్రచార పోస్టర్లు(campaign posters) విడుదల చేసి ప్రజలకు పంపిణీ చేశారు.

గురుకుల పాఠశాల, మాస్టర్ మైండ్స్, శ్రీ చైతన్య, NCC, రెడ్‌క్రాస్ సంస్థల విద్యార్థులు, పోలీసు సిబ్బంది, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Leave a Reply