Birmingham | అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో మంటలు…

  • ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి

అమెరికాలోని బర్మింగ్‌హామ్ నగరంలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి చెందడం తెలుగు రాష్ట్రాల్లోని వారి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. బర్మింగ్‌హామ్‌లోని ఒక అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో మంటలు అకస్మాత్తుగా చెలరేగడంతో మొత్తం భవనం దట్టమైన అలుముకుంది.

ఈ ప్రమాదంలో సహజ రెడ్డి అనే విద్యార్థి, కూకట్‌పల్లికి చెందిన మరో విద్యార్థి ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఇద్దరూ అలబామా యూనివర్సిటీ ఎట్ బర్మింగ్‌హామ్ (UAB) లో ఉన్నత విద్య అభ్యసిస్తున్నారు. ప్రమాద సమయంలో అపార్ట్‌మెంట్‌లో మొత్తం 10 మంది తెలుగు విద్యార్థులు ఉన్నట్టు తెలిసింది. వారిలో ఇద్దరు తీవ్రంగా గాయపడగా, వారిని అత్యవసర చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.

అగ్నిప్రమాదం ఎలా జరిగింది? ఎక్కడి నుంచి మంటలు చెలరేగాయి? అనే అంశాలపై స్థానిక పోలీసులు, అగ్నిమాపక శాఖ దర్యాప్తు చేపట్టాయి.

Leave a Reply