గెలిపిస్తే ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సేవలందిస్తా…

  • 13వ వార్డు అభ్యర్థి కొత్తపల్లి మహేందర్

ఉట్నూర్, , ఆంధ్ర ప్రభ : ఉట్నూర్, ఆంధ్రప్రభ : లక్కారం పంచాయతీ 13వ వార్డు ప్రజలు తనను గెలిపిస్తే… ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి ప్రజలకు సేవలందిస్తానని వార్డు అభ్యర్థి కొత్తపల్లి మహేందర్ అన్నారు. శుక్రవారం ఆయన తన వార్డులో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.

తన గుర్తు గౌను అని గుర్తుచేసిన మహేందర్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ ఆశీస్సులతో అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ నిరుద్యోగులకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా పనిచేస్తానని తెలిపారు.

వార్డు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి, కాలనీలోని మౌలిక వసతుల అభివృద్ధికి కట్టుబడి ఉంటానని కొత్తపల్లి మహేందర్ భరోసా ఇచ్చారు.

Leave a Reply