సమస్యల పరిష్కారానికే ప్రజాదర్బార్ : యార్లగడ్డ

గన్నవరం, ఆంధ్రప్రభ : ప్రజా సమస్యల పరిష్కరించేందుకు ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. గన్నవరం మండలం కేసరపల్లి గ్రామంలో శుక్రవారం సాయంత్రం ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజా దర్బార్ నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన యార్లగడ్డ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి వాటిని నిర్దిష్ట గడువులోగా పరిష్కరించాలని అధికారులు ఆదేశించారు.

ఈ సందర్భంగా యార్లగడ్డ మాట్లాడుతూ… ప్రజా సమస్యల పరిష్కారంలో గన్నవరం నియోజకవర్గం రాష్ట్రంలోనే రెండో స్థానంలో ఉందని అధికారుల మంచి పనితీరు వల్లే ఇది సాధ్యమైంది అన్నారు. అధికారుల పనితీరు వల్లే సాధ్యమైందన్నారు. ప్రతి వారం నిర్వహించే ప్రజాదర్బార్ల సమస్యల పరిష్కారంలో అలసత్వం వహిస్తే సహించేది లేదని అధికారులు హెచ్చరించారు.

సమస్యల పరిష్కారంలో రెండో స్థానం నుంచి మొదటి స్థానానికి చేరుకునేందుకు అధికారులు అందరూ సమన్వయంతో పని చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో గన్నవరం మండల టిడిపి అధ్యక్షులు గూడపాటి తులసి మోహన్, కమ్మ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ చిరుమామిళ్ల సూర్యం, గ్రామ సర్పంచి లక్ష్మీ మౌనిక, టిడిపి నాయకులు దొంతు చిన్న, జాస్తి విజయభూషణ కుమార్, అన్నే హరికృష్ణ, జనసేన నాయకులు చిమట రవి వర్మ, తాసిల్దార్ శివరావుతాసిల్దార్ శివరావు, ఎండిఓ స్వర్ణలత తదితర అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply