Appeal | మరోసారి ఆదరిస్తే.. మరింత అభివృద్ధి..
- పన్నూర్ సర్పంచ్ అభ్యర్థి అల్లం పద్మ తిరుపతి
Appeal | రామగిరి, ఆంధ్రప్రభ : గతంలో చేసిన అభివృద్ధిని చూసి మరోసారి అవకాశం ఇవ్వాలని పన్నూర్ సర్పంచ్ అభ్యర్థి అల్లం పద్మ తిరుపతి కోరుతున్నారు. తనకు కేటాయించిన గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే.. మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని ఓటర్లకు విజ్ఞప్తి(Appeal to voters) చేశారు. గత ఐదేళ్లుగా చేసిన అభివృద్ధి పనులను వివరించారు. పెరుమండ్ల రోడ్ 20 అడుగుల వెడల్పుతో 300 మీటర్ల రోడ్డు, సిద్దం వాడకు సీసీ రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మించామన్నారు.
అభయాంజనేయ స్వామి దేవాలయానికి సీసీ రోడ్డు(cc roads) వేయించామని, దేవాలయం చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మాణం చేపట్టామన్నారు. గ్రామపంచాయతీ స్థలం, భవనం బిల్డింగ్ నిర్మాణం, వాటర్ ప్లాంట్ షెడ్డు నిర్మాణం, 14 హైమాక్స్ లైట్లు ఏర్పాటు చేశామన్నారు. గ్రామ పంచాయతీలో కొత్త బోర్, అంగన్వాడీ స్కూల్ దగ్గర కొత్త బోర్, పేరుమండ్ల వరకు కొత్త కరెంట్ లైన్(new current line) వేయించామన్నారు. గతంలో ఐదేళ్లపాటు సర్పంచ్ గా సేవలందించిన సమయంలో వాడవాడలా డ్రైనేజీల నిర్మాణం, సీసీ రోడ్లు నిర్మాణం చేపట్టామన్నారు. ప్రజలకు మౌళిక వసతుల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని గుర్తు చేశారు. మరోసారి అవకాశం ఇస్తే.. మరింత అభివృద్ధి చేస్తామని అల్లం పద్మ తిరుపతి కోరారు.

