Actions | రెంజల్, ఆంధ్రప్రభ : సర్పంచు ఎన్నికల సందర్భంగా గ్రామంలో అల్లర్లు సృష్టిస్తే చట్టపర చర్యలు(Legal actions) తీసుకోవడంలో వెనుకాడే ప్రసక్తే లేదని షీటీం కానిస్టేబుల్ సునీత(Sunita) అన్నారు. శుక్రవారం మండలంలోని వీరన్నగుట్ట గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని అభ్యర్థులు ముమ్మరం చేయడం వలన గొడవలు జరిగే ప్రమాదం ఉందన్నారు. ఎవరి ప్రచారం వారు నిర్వహించుకోవాలని, అనవసరంగా ఘర్షణలకు(to clashes) తావివ్వ వద్దన్నారు. ఎన్నికల ప్రచారం సాయంత్రం 6 గంటల వరకు ముగించుకోవాలని, లేనియెడల అభ్యర్థులే పూర్తి బాధ్యత(Full responsibility) వహించవలసి ఉంటుందన్నారు. కార్యక్రమంలో రిటైర్డ్ ఎస్సై సురేందర్ రాజ్, మాజీ సర్పంచ్ వినోద్ కుమార్, ధర్మవీర్, షీటీం సభ్యులు ఉన్నారు.
Actions | అల్లర్లు సృష్టిస్తే చర్యలు

