Development | మీ సేవకురాలిగా పనిచేస్తా
- మీ అమూల్యమైన ఓటువేసి గెలిపించండి
Development | నిజామాబాద్ జిల్లా, రెంజల్, ఆంధ్రప్రభ : మీ అమూల్యమైన ఓటు తనకు కేటాయించిన గుర్తుకు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని, మీ సేవకురాలిగా గ్రామాన్ని అభివృద్ధి పథం(development trajectory)లో నడుపుతానని తిరుపతి లలిత హనుమాన్లు (బుజ్జి) అన్నారు. మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారాన్ని శుక్రవారం ముమ్మరం చేశారు.
ఆమె మాట్లాడుతూ… గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని, గ్రామస్తుల సూచనలు, సలహాలతో ముందుకు సాగుతానన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి శ్రమిస్తానని, గ్రామ ప్రజల(village people) ఆశీస్సులతో మీ ముందుకు వచ్చానని, తనకు కేటాయించిన గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని కోరారు.
కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు అమ్రాది.శేఖర్, తిరుపతి రాము, జావేద్, లోక గంగాధర్, తిమ్మాపూర్ నారాయణ, లోలపు రెడ్డి, మూట పోశెట్టి, గోవింద్ తదితరులు ఉన్నారు.

