DEAD | గుండెపోటుతో స‌ర్పంచ్ అభ్య‌ర్థి మృతి

DEAD | గుండెపోటుతో స‌ర్పంచ్ అభ్య‌ర్థి మృతి

  • ప్రజాసేవ కల నెరవేరకముందే కన్నుమూత
  • చింతల్ టాణ సర్పంచ్ అభ్యర్థి మృతితో గ్రామంలో విషాదం


DEAD | వేముల‌వాడ, ఆంధ్ర‌ప్ర‌భ : ప్రజాసేవ చేయాలనే తపనతో ఎంతో ఉత్సాహంగా సర్పంచ్ ఎన్నికల (Election) ప్రచారంలో దూసుకెళ్తున్న ఓ అభ్యర్థి అకస్మాత్తుగా గుండెపోటుతో మృతి చెందడంతో చింతల్ టాణ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వేములవాడ అర్బన్ మండలం, చింతల్ టాణ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చెర్ల మురళి గుండెపోటుతో శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూశారు.

ఎన్నికల్లో బీఆర్ఎస్ (BRS) పార్టీ నుంచి పోటీ చేస్తూ ఎంతో ఉత్సాహంగా నిన్నటి వరకు ప్రచారం నిర్వహించిన చెర్ల మురళి, గ్రామస్తులకు ప్రజాసేవ చేసేందుకు ఎన్నో కలలు కన్నారు. గ్రామాభివృద్ధికి మెరుగైన ప్రణాళికలతో ముందుకు సాగుతున్న మురళి ఆకస్మిక మృతిని కుటుంబ సభ్యులు తట్టుకోలేకపోతున్నారు. మురళి మృతి పార్టీకి తీరనిలోటని పార్టీ వర్గాలు ఆవేదన వ్యక్తం చేశారు.

Leave a Reply