Sharadha | ఆదరించండి..
- లేడీస్ పర్స్ గుర్తుకు ఓటు వేసి గెలిపించండి
- మీ ఇంటి ఆడపడుచును నేను
- ఎలికట్ట గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా
- ఎలుకట్ట సర్పంచ్ అభ్యర్థి శెర్రి శారద
Sharadha | షాద్ నగర్, ఆంధ్రప్రభ : నేను మీ ఇంటి ఆడపడుచును.. లేడీస్ పర్సు (Ladies’ purse) గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించండి.. ఎలికట్ట గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని ఎలికట్ట సర్పంచ్ అభ్యర్థి శారద అన్నారు. ఎలికట్ట గ్రామంలో అన్ని మౌలిక సదుపాయాలు(Infrastructure) ఏర్పాటు చేస్తానని పేర్కొన్నారు. వీధిలైట్లు, డ్రైనేజీ, నీటి సమస్య, సీసీ రోడ్ల(CC roads) నిర్మాణాల కోసం ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి గ్రామాన్ని అభివృద్ధి పరుస్తానని పేర్కొన్నారు. ఎలకట్ట గ్రామ ప్రజలు తనను ఆదరించి అభిమానించి మీ అమూల్యమైన(priceless) ఓటును వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

