Temple | ఘనంగా అంజన్న బ్రహ్మోత్సవాలు…
Temple | ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని బిజ్వార్ గ్రామంలో వెలిసిన వ్యాసరాయల మహర్షిచే ప్రతిష్టించిన శ్రీ పడమటి ఆంజనేయ స్వామి(Sri Padamati Anjaneya Swamy) బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడవరోజు ఈ రోజు పౌర్ణమి సందర్భంగా ఆలయ పూజారి నరసింహ చారి జోషి, రవికుమార్ జోషి, నాగరాజ్ చారి జోషి, వేణుగోపాల చారి జోషిలచే స్వామివారికి అభిషేకం, పుష్పాలంకరణ, తమలపాకుల సేవ, వస్త్రాలంకరణ, నైవేద్యం, మహా మంగళహారతి చేసి తీర్థ ప్రసాద వితరణ చేశారు.
ఈ సందర్భంగా ఆంజనేయ స్వామి భజన మండలచే అడుగుల భజన, చెక్కభజనతో ఆలయ ప్రాంగణమంతా అంజన్న నామస్మరణతో మారు మోగింది. అనంతరం గ్రామ భక్తులు బురుజు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం(Annadana program) నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు మహేష్ గౌడ్, దొరోల్ల కృష్ణయ్య,గుడిసె రాజప్ప, రామచంద్రయ్య గౌడ్, బి.సుధాకర్ రెడ్డి, కుక్కలి వెంకటప్ప, పోలీస్ హన్మీ రెడ్డి,నిమ్మకాయల హనుమంతు, అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

