Model Code of Conduct | ఎన్నికల కోడ్ అతిక్రమిస్తే చర్యలు..
Model Code of Conduct | నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : నాగర్ కర్నూల్ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎలక్షన్ సందర్భంగా అచ్చంపేట మండలం నడింపల్లి, పల్కపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రం (క్లస్టర్) ను జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి పాటిల్(Dr. Sangram Singh G. Patil) తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ మాట్లాడుతూ… పంచాయతీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు నామినేషన్ కేంద్రాల(Nomination Centres) వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులకు, ఎలక్షన్ సిబ్బందికి సహకరించాలని, ఈ నామినేషన్ కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశామని, జిల్లాలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్(Model Code of Conduct) అమలులో ఉందని, ఈ కోడ్ పంచాయతీ ఎలక్షన్స్ ముగిసే వరకు ఉంటుందని, ఎవరైనా కోడ్ ను అతిక్రమిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

