Under 14 Cricket | రాష్ట్ర స్థాయి క్రికెట్లో రాణించాలి

Under 14 Cricket | రాష్ట్ర స్థాయి క్రికెట్లో రాణించాలి
మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి
Under 14 Cricket | మక్తల్, ఆంధ్రప్రభ : రాష్ట్రస్థాయి ఎసీజీఎఫ్ క్రికెట్ పోటీ(ACGF Cricket Competition)లో ప్రతిభ కనబరుస్తూ జిల్లా జట్టు విన్నర్‌గా నిలవాలని రాష్ట్ర పశుసంవర్ధక క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి(Minister Dr. Vakiti Srihari) అన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా అండర్ 14 క్రికెట్ జట్టు ఈ రోజు నారాయణ పేట జిల్లా మక్తల్ పట్టణం నుంచి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా అండర్ 14 బాలుర క్రికెట్(Under 14 Boys Cricket) జట్టు భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో జరుగనున్న రాష్ట్రస్థాయి క్రీడలకు బయల్దేరి వెళ్లింది.

ఈ సందర్భంగా క్రీడాకారులను మంత్రి వాకిటి అభినందించారు. అనంతరం మాట్లాడుతూ మీకు అవసరమైన సదుపాయాలును కల్పిస్తానని తెలిపారు. రాష్ట్రస్థాయిలో మంచి ప్రదర్శన కనబరిచి జిల్లాకు పేరు తీసుకొని రావాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో డీవై ఎస్ఓ వెంకటేష్ శెట్టి, క్రీడా దుస్తుల దాత లక్ష్మీనారాయణ, టీం మేనేజర్‌గా విష్ణువర్ధన్, కోచ్ వలియోద్దీన్ పాల్గొన్నారు.
