అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండాలని వైసీపీ నిర్ణయించినట్లు వైసీపీ అధినేత వైఎస్.జగన్ తెలిపారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఆయన సమావేశమయ్యారు. తాను 30ఏళ్ల పాటు రాజకీయాల్లో ఉంటానని జగన్ చెప్పారు. అసెంబ్లీకి వెళ్లకపోయినా ప్రజా సమస్యల కోసం పోరాడుతామని చెప్పారు. 2028 జమిలి ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ ఇచ్చిన ఇళ్లను వెనక్కి తీసుకుంటే ఊరుకునేది లేదని తేల్చిచెప్పారు.
AP : అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ దూరం… జగన్ ప్రకటన
