Srikakulam | అత్యవసర చికిత్స అందించాలి

Srikakulam | అత్యవసర చికిత్స అందించాలి

తాళ్లవలస డయేరియా ఘటనపై మంత్రి అచ్చెన్నాయుడు ఆరా

Srikakulam | సంతబొమ్మాలి(శ్రీకాకుళం), ఆంధ్ర‌ప్ర‌భ : తాళ్లవలస గ్రామంలో డయేరియా వ్యాప్తి చెందిన నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు (Atchannaidu) తక్షణమే స్పందించారు. ఈ విషయమై ఆయన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో మాట్లాడి, గ్రామంలో నెలకొన్న పరిస్థితుల వివరాలను తెలుసుకున్నారు. డయేరియా వ్యాప్తిని అరికట్టేందుకు తక్షణమే గ్రామాన్ని సందర్శించి, సమగ్ర నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు.

అదేవిధంగా, ఆ గ్రామానికి వైద్య బృందాలను పంపించి, బాధితులకు అత్యవసర చికిత్స (Treatment) అందించాలని, శుభ్రతా చర్యలను వేగవంతం చేయాలని మంత్రి సూచించారు. గ్రామ ప్రజల ఆరోగ్యం విషయంలో ఎటువంటి అలసత్వం ఉండకూడదని స్పష్టం చేస్తూ, అవసరమైన మందులు, తాగునీటి నమూనాల పరీక్షలు, శానిటేషన్ చర్యలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Leave a Reply