Market | మార్కెట్ తరలింపు కోసం ఉద్రిక్తత

Market | మార్కెట్ తరలింపు కోసం ఉద్రిక్తత

Market | భీంగల్ టౌన్, ఆంధ్రప్రభ : వ్యాపార సంస్థలకు, ట్రాఫిక్ కు ఇబ్బందికరంగా మారిన కూరగాయల మార్కెట్ (vegetable market) ను తరలించాలని వ్యాపారులు, అఖిల పక్షం ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించారు. గత మూడు, నాలుగు నెలల నుండి మార్కెట్ ను ఓల్డ్ తహసీల్దార్ కార్యాలయం ఆవరణలోకి తరలించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు, వినతులు చేసినా అధికారులు మార్కెట్ తరలింపు లో నిర్లక్ష్యం వహిస్తూ వస్తున్నారు. కొందరు కూరగాయల వ్యాపారులు వ్యాపారస్తుల షాప్స్ ఎదుట వారి వ్యాపారాలు ఏర్పాటు చేసుకుని ఇబ్బంది క‌లిగిస్తున్నారు. దీంతో పాటు ట్రాఫిక్ కు ఇబ్బంది చేస్తున్నారు. విసుగు చెందిన వ్యాపారులు అఖిలపక్షం సహకారంతో సోమవారం ఆందోళనకు దిగారు. మున్సిపల్ కమిషనర్ (Municipal Commissioner) తీరును నిరసించారు. కూరగాయల వ్యాపారులకు వంత పడుతున్నట్టు ఆరోపణలు చేశారు.

ఈ నేపథ్యంలో పట్టణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సోమవారం సంతలో దుకాణాలు ఏర్పాటు చేసేందుకు వచ్చిన వారిని తహసీల్దార్ ఓపెన్ ప్లేస్ కు తరలించారు. చిన్న, చిన్న షాప్ ల వారు ఆందోళనకారుల వినతి మేరకు తహసీల్దార్ కార్యాలయం (Tahsildar Office) ఆవరణలోకి వెళ్ళగా, మరికొందరు అధికారుల ఆదేశాల మేరకు షాప్స్ తీసేందుకు అంగీకరించారు. తహసీల్దార్ షబ్బీర్, సీఐ సత్యనారాయణ, ఎస్సై లు సందీప్, రాము, అనిల్ రెడ్డి ఆధ్వర్యంలో బందో బస్తు ఏర్పాటు చేశారు.

Leave a Reply