Ramannapet | అభివృద్ధి పథంలో నడిపిస్తా..
Ramannapet | రామన్నపేట, ఆంధ్రప్రభ : రామన్నపేట (Ramannapet) మేజర్ గ్రామపంచాయతీ గ్రామ సర్పంచ్ గా ఒకసారి అవకాశం ఇస్తే పట్టణాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గరిక సత్యనారాయణ (Garika Satyanarayana) అన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామన్నారు. ప్రజలతో కలిసి గ్రామాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తామన్నారు.
ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండి సేవ చేయడానికి తాను ముందుంటానని వారు పేర్కొన్నారు. జిపి పరిధిలోని సమస్యలను ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి (solve problems) కృషి చేస్తానని ఆయన తెలిపారు. ఈ ఎన్నికల్లో తమకు అవకాశం ఇచ్చి ఓటు వేసి గెలిపించాలని ఎల్లప్పుడు తాను ప్రజలకు ఓటర్లకు రుణపడి ఉంటానని వారు తెలిపారు.

