Tadwai | బైక్ అదుపుతప్పి…
ఒక్కరు మృతి
Tadwai | తాడ్వాయి, ఆంధ్రప్రభ : ద్విచక్ర వాహనం (bike) ఆదుపు తప్పి ఒక్కరు మృతిచెందిన సంఘటన తాడ్వాయి (Tadwai) మండలంలో చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం… గోవిందారావుపేట మండలం మొట్లగూడెంకు చెందిన కోటే సంతోష్ (Kote Santhosh) మేడారం నుంచి మొట్లగూడెంకు వెళ్తున్న క్రమంలో ద్విచక్ర వాహనం అదుపు తప్పి పడిపోయారు. దీంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. ఈ ఘటనతో మొట్లగూడెంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

