Bodhan | వాహనాల తనిఖీ

Bodhan |వాహనాల తనిఖీ
Bodhan | బోధన్, ఆంధ్రప్రభ : గ్రామపంచాయతీ ఎన్నికలను పురస్కరించుకొని వాహనాల తనిఖీల (vehicles Inspection) ను ముమ్మరం చేశారు. ప్రత్యేక ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీ చేస్తున్నారు. బోధన్ (Bodhan) మండలం అంతరాష్ట్ర రహదారిపై వాహన తనిఖీ ముమ్మరం చేశారు. నగదు, మద్యం (cash and liquor) రవాణా చేయకుండా ఫ్లయింగ్ స్క్వాడ్ కెమెరా లతో తనిఖీలు చేస్తుంది. సాలురా క్యాంపు వద్ద చేపట్టిన తనిఖీలలో ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బంది శ్వేత, కృష్ణ, సురేందర్ లు తనిఖీలు నిర్వహించారు.
