Hanumakonda | పుష్‌-పుల్ రైలు సర్వీస్ ను ప్రారంభించాలి

Hanumakonda | పుష్‌-పుల్ రైలు సర్వీస్ ను ప్రారంభించాలి

Hanumakonda | హనుమకొండ ప్రతినిధి : వరంగల్–హైదరాబాద్ మధ్య పుష్‌-పుల్ రైలు (Push-pull train) సర్వీస్ ను తక్షణమే ప్రారంభించాలని, ఇప్పటికే నడుస్తున్న రైళ్లలో సాధారణ బోగీల సంఖ్య పెంచాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి(G. Kishan Reddy)ని కోరారు.

శనివారం వరంగల్‌లో మంత్రిని కలిసిన గంట రవికుమార్ (Ganta Ravikumar) వినతిపత్రం అందజేస్తూ, నిత్యం వేలాది మంది విద్యార్థులు, కార్మికులు, ఉద్యోగులు రైలు సేవలపై ఆధారపడుతుండగా, సాధారణ బోగీలు కిక్కిరిసి పోతున్నాయి. అందువల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. పుష్‌-పుల్ రైలు (Push-pull train) ప్రారంభిస్తే సామాన్య ప్రయాణికులకు భారీ ఉపశమనం కలుగుతుందని వివరించారు. ఇటీవల వర్షాల వల్ల రైల్వే ట్రాక్‌లపై నీరు చేరిన సమస్య, శిథిలమైన (జిఆర్పీ) పోలీస్ స్టేషన్ మరమ్మతులపై దృష్టి పెట్టాలని కోరారు.

Leave a Reply