Chennur | ఘనంగా పూలే వర్ధంతి

Chennur | ఘనంగా పూలే వర్ధంతి
Chennur | చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూరు (Chennur) నియోజకవర్గ కేంద్రంలో శుక్రవారం మహాత్మా జ్యోతిరావుపూలే (Mahatma Jyotirao Phule) 135వ వర్ధంతి వేడుక బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వాహించారు. స్థానిక తెలంగాణ చౌరస్తాలోని పూలే విగ్రహానికి మాలలు వేసిన బీసీ నేతలు (BC Leaders) మాట్లాడుతూ… బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసి తన జీవితాన్ని త్యాగం చేసి సమానత్వానికి ప్రతీకగా నిలిచారని కొనియాడారు. మహనీయులు చూపించిన సామాజిక న్యాయం, విద్య, సమానత్వం అనే మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని పిలుపునచ్చారు.
