Rs. 28 crores | అభివృద్ధికి చిరునామాగా గుర్తింపు తెస్తా..

Rs. 28 crores | అభివృద్ధికి చిరునామాగా గుర్తింపు తెస్తా..

  • రూ.28 కోట్లతో ఔటర్ రింగ్ రోడ్డు పనులు పూర్తి
  • ఆర్.అండ్.బి భవన షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులకు ప్రతిపాదనలు
  • అభివృద్ధి నిర్మాణ పనులను త్వరిత గతిన పూర్తి చేయాలి
  • మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

Rs. 28 crores | హుజూర్‌నగర్‌, ఆంధ్రప్రభ : సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అభివృద్ధికి చిరునామాగా మారుస్తానని రూ. 28 కోట్ల(Rs. 28 crores) రూపాయలతో నిర్మించిన ఔటర్ రింగ్ రోడ్ హుజూర్‌నగర్ పట్టణానికి మణిహారంలా ఉంటుందని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy) అన్నారు. ఈ రోజు హుజూర్‌నగర్ మున్సిపల్ పరిధిలో ఔటర్ రింగ్ రోడ్డును ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… 2013 లో 22 కోట్ల రూపాయలతో పట్టణనికి ఒక వైపు ఔటర్ రింగ్ రోడ్డు నిర్మించామని, తిరిగి ఇప్పుడు అదనంగా రూ.6 కోట్లు మంజూరు చేయించి రెండు కిలోమీటర్ల మేర పనులను హుజూర్‌నగర్ పట్టణానికి చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం పూర్తి కావడంతో పట్టణంలోకి బారీ ఇతర వాహనాలు రాకుండా బయట నుండే వెళ్లడంతో పట్టణ ప్రజలకు ట్రాఫిక్ సమస్య లేకుండా ఉంటుందన్నారు.

ఔటర్ రింగ్ రోడ్డు(Outer Ring Road)పై ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం రూ.7.5 కోట్లతో నిర్మాణం జరుగుతున్న జూనియర్ కాలేజీ, రూ.4.5 కోట్లతో నిర్మాణం జరిగితున్న డిగ్రీ కాలేజీ, 8 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న డివిజనల్ కార్యాలయం, ఆర్ & బి గెస్ట్ హౌస్(R&B Guest House) నిర్మాణం పనులను మంత్రి పర్యవేక్షించి పనులను పరిశీలించి నాణ్యత పాటిస్తూ, మే చివరి నాటికి నిర్మాణ పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకు తీసుకొని రావాలని అధికారులను ఆదేశించారు.

ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ ఆవరణలో షాపింగ్ కాంప్లెక్స్(Shopping Complex) నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి రాష్ట్రములోనే మొదటి సారిగా ఆర్ అండ్ బి గెస్ట్ హౌజ్ ఆవరణలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నామని తెలిపారు.ప్రభుత్వ కార్యాలయాల నిర్వహణను మరింత సమర్థవంతంగా చేపట్టేందుకు ప్రభుత్వ కార్యాలయ ఆవరణలో షాపింగ్ కాంప్లెక్స్ లను నిర్మించి పబ్లిక్ లీజ్ పద్ధతి ద్వారా అద్దెకు ఇవ్వాలని తద్వారా లభించే అద్దె ఆదాయాన్ని కార్యాలయ భవనంలో మెరుగైన సౌకర్యలతో మౌలిక వసతుల అభివృద్ధి చేసుకోవచ్చని మంత్రి తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆర్.అండ్.బి ఈఈ సీతారామయ్య, డిఈ రమేష్, టిజిఈడబ్ల్యూ ఐడిసి డిఈ రమేష్, ఇరిగేషన్ ఈఈ రామకిషోర్, డిఈ సత్యనారాయణ ముఖ్య నాయకులు తన్నీరు మల్లికార్జున్ దొంతగాని శ్రీనివాస్, గెల్లి రవి, దొంగరి వెంకటేశ్వర్లు, కోతి సంపత్ రెడ్డి, గూడెపు శ్రీనివాస్, ఆదేర్ల శ్రీనివాసరెడ్డి, ఈడ్పుగంటి సుబ్బారావు, ఎమ్డీ అజీజ్ పాషా, కుంట సైదులు కుక్కడపు మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply