Temple | బాలాంబ తల్లిని దర్శించుకున్న యార్లగడ్డ
Temple | ఉంగుటూరు, ఆంధ్రప్రభ : ఉంగుటూరు మండలం మానికొండ గ్రామంలోని బాలాంబ తల్లి అమ్మవారి ఆలయంలో ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బుధవారం (on wednesday) ఆలయ 44వ వార్షికోత్సవ సందర్భంగా ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు యార్లగడ్డకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఎమ్మెల్యే వెంట టీడీపీ మండల అధ్యక్షులు గూడపాటి తులసి మోహన్, కొలుసు రవీంద్ర, గన్నవరం ఏఎంసీ ఉపాధ్యక్షులు కొండేటి వెంకటేశ్వరరావు, తెలుగు రైతు జిల్లా నాయకులు మొవ్వ వెంకటేశ్వరరావు, టీడీపీ నాయకులకు కుందేటి చంద్రశేఖర్, ఆరికట్ల రవికుమార్, ఎడ్లపల్లి సాయిబాబు, బెజవాడ నాగేశ్వరరావు, షేక్ అజిజ్ తదితరులు పాల్గొన్నారు.


