IND v SA | భార‌త్‌ ఘోర ఓటమి

IND v SA | భార‌త్‌ ఘోర ఓటమి

  • రెండో టెస్టులో ప‌రాభ‌వం..
  • సిరీస్​ను క్లీన్​స్వీప్ చేసిన సౌతాఫ్రికా

IND v SA | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్ డెస్క్ : సౌతాఫ్రికాతో రెండో టెస్టులో భారత్ చిత్తుగా ఓడింది. గౌహ‌తిలో జ‌రిగిన రెండో టెస్టులో సౌతాఫ్రికా 408 ర‌న్స్(South Africa 408 runs) తేడాతో విజ‌యం సాధించింది. 549 పరుగుల భారీ టార్గెట్​తో నాలుగో ఇన్నింగ్స్​లో బరిలో దిగిన టీమ్ఇండియా 140 రన్స్​కే కుప్పకూలింది. రవీంద్ర జడేజా (54) ఒక్కడే రాణించాడు.

మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు. ఆల్​రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన సౌతాఫ్రికా 408 పరుగుల భారీ తేడాతో నెగ్గింది. సౌతాఫ్రికా బౌలర్లలో సిమన్ హార్మర్ 6 వికెట్ల(Simon Harmer 6 wickets)తో భారత్ పతనాన్ని శాసించాడు. కేశవ్ మహారాజ్ 2, ముత్తుసామి, మార్కో యాన్సెన్ తలో 1 వికెట్ దక్కించుకున్నారు.

స్వ‌దేశీ పిచ్‌ల‌పై ఇండియా దారుణ‌మైన రీతిలో ఓట‌మిని చ‌విచూసింది. మ‌రీ 408 ర‌న్స్ తేడాతో స్వంత పిచ్‌పై ఓడిపోవ‌డం .. ఇండియ‌న్ బ్యాటింగ్ లైన‌ప్‌(batting line-up)లో బ‌ల‌హీన‌త‌ల‌ను బ‌య‌ట‌పెట్టింది. ద‌క్షిణాఫ్రికా కొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఇండియాతో జ‌రిగిన టెస్టు సిరీస్‌(INDvSA)ను 2-0 తేడాతో సొంతం చేసుకున్న‌ది.

గ‌తంలో 2000 సంవ‌త్స‌రంలో హ‌న్సీ క్రానే నేతృత్వంలోని ద‌క్షిణాఫ్రికా చేతిలో కూడా ఇండియా టెస్టు సిరీస్‌ను కోల్పోయింది.

Leave a Reply