Rs 600 | తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు…

Rs 600 | తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు…
Rs 600 | ఊట్కూర్, ఆంధ్రప్రభ : రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని పీఏసీఎస్ చైర్మన్ ఎం బాల్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు డి. యగ్డేశ్వర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీలు సూర్య ప్రకాశ్ రెడ్డి, మణెమ్మ గోపాల్ రెడ్డి అన్నారు. ఈ రోజు నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో రైతులకు సబ్సిడీ వరి విత్తనాలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం జాతీయ ఆహార భద్రతా పథకం కింద సబ్సిడీపై పంపిణీ చేస్తున్న వరి విత్తనాలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy), మంత్రి వాకిటి శ్రీహరి(Minister Vakiti Srihari) రైతుల సంక్షేమానికి ప్రత్యేక కృషి చేస్తున్నారని నారాయణపేట – కొడంగల్ ఎత్తిపోతల పథకంతో ఈ ప్రాంతానికి సాగునీరు అందించి బీడు భూములను సస్యశ్యామలం చేస్తున్నారని అన్నారు.
రైతులను ఆదుకుంటున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందని రుణమాఫీ పెట్టుబడి సహాయం అందజేస్తూ సబ్సిడీ విత్తనాలు పంపిణీ చేస్తుందని అన్నారు. రైతులు వ్యవసాయ శాఖ అధికారుల సలహాలు, సూచనల మేరకు పంటలు సాగు చేసి తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు పొందాలని అన్నారు. జాతీయ ఆహార భద్రత పథకం కింద రైతులకు 25 కిలోల(25 kg) వడ్లబస్త సబ్సిడీపైరూ 600కు(Rs 600) పంపిణీ పంపిణీ చేస్తుందన్నారు. ఊట్కూర్ పెద్ద చెరువుకు సాగునీరు అందిస్తే ఈ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందనిఅన్నారు.
రైతులు ప్రభుత్వం ప్రవేశపెడుతున్న వివిధ పథకాలు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏవో గణేష్ రెడ్డి(AO Ganesh Reddy), ఏ ఈ ఓ స్వరూపారాణి, మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు ఎల్కోటి జనార్దన్ రెడ్డి, గోపాల్ రెడ్డి, గోవిందప్ప, శివరామరాజు, మోహన్ రెడ్డి,రవికుమార్, దత్తు, శంకర్, జమీన్ ఖుర్షద్ తదితరులు పాల్గొన్నారు.
