NTR | టైటిల్ మారబోతుందా..?

NTR | టైటిల్ మారబోతుందా..?
NTR, హైదరాబాద్, ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : యంగ్ టైగర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prasanth Neel).. ఈ ఇద్దరి కాంబోలో భారీ పాన్ ఇండియా మూవీ రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జంటగా రుక్మిణి వసంతన్ నటిస్తుంది. కేజీఎఫ్, సలార్ సినిమాల తర్వాత ప్రశాంత్ నీల్ నుంచి వస్తున్న మూవీ కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆమధ్య ఈ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పుడు.. అసలు కథ ఏంటి..? ఎన్టీఆర్ ను ఎలా చూపించబోతున్నారు అనేది ఆసక్తిగా మారింది. అలాగే టైటిల్ డ్రాగన్ అంటూ ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు టైటిల్ మారబోతుందని టాక్. ఇంతకీ.. ఏమైంది..?
ప్రశాంత్ నీల్ కు ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే.. పవర్ ఫుల్ స్టోరీతో ఈ సినిమా చేస్తున్నాడని తెలిసింది. అసలు కథ ఏంటి..? ఎన్టీఆర్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది అనేది చెప్పలేదు కానీ.. ఇంత వరకు ఎన్టీఆర్ ను ఎవరూ చూపించని విధంగా చాలా పవర్ ఫుల్ గా చూపించబోతున్నారని తెలిసింది. ఈ విషయాన్ని ఎవరో కాదు.. స్వయంగా చిత్ర నిర్మాతల్లో ఒకరైన మైత్రీ మూవీస్ రవి (Ravi) ఓ మీడియా మీట్ లో చెప్పడం విశేషం. అంతే కాకుండా ఇది నేషనల్ లెవల్ మూవీ కాదు.. ఇంటర్నేషనల్ లెవెల్ మూవీ అని చెప్పడంతో ఈ సినిమా పై ఇప్పటి వరకు ఉన్న అంచనాలు రెట్టింపు అయ్యాయని చెప్పచ్చు.
ఇక టైటిల్ విషయానికి వస్తే.. ఇప్పటి వరకు ఈ సినిమాకి టైటిల్ ట్రాగన్ (Dragon) అంటూ ప్రచారం జరిగింది. ఓ సందర్భంలో దాదాపుగా ఈ టైటిలే కన్ ఫర్మ్ కావచ్చు అని నిర్మాత చెప్పడం జరిగింది. అయితే.. ఇప్పుడు ఈ క్రేజీ మూవీ కోసం మరో పవర్ ఫుల్ టైటిల్ అనుకుంటు న్నామని నిర్మాత రవి తెలియచేశారు. ఇలా చెప్పినప్పటి నుంచి ఎన్టీఆర్, నీల్ మూవీ టైటిల్ ఏంటా అనే చర్చ మొదలైంది. నెక్ట్స్ ఇయర్ జూన్ 25న ఈ భారీ పాన్ ఇండియా మూవీని రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు. సో.. ఈ మూవీ టైటిల్ ఏంటో.. ఎన్టీఆర్ క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
