BANK| కల నెరవేరింది..

BANK | కల నెరవేరింది..


మాజీ సర్పంచ్ చల్లా ఉమా సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు

BANK | స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ : స్టేషన్ ఘన్ పూర్ మండలంలోని తాటికొండ గ్రామ అభివృద్ధి దిశగా మరో కీలక అడుగు పడింది. ఎన్నో రోజులుగా తాటికొండ గ్రామస్తుల కలగా ఉన్న ప్రజల చిరకాల కోరిక అయిన బ్యాంకు స్థాపన కల నెరవేరింది. ఇందులో భాగంగానే గ్రామంలో గ్రామీణ వికాస్ బ్యాంకు ముహూ ర్తం కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్బంగా మాజీ సర్పంచ్ చల్లా ఉమా సుధీర్ రెడ్డి పూజలో కూర్చొని సంప్రదాయంగా పూజ కార్యక్రమాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా అధికారికంగా బ్యాంకు పనులు ప్రారంభించిన వారికి గ్రామస్థులు శుభాకాంక్షలు తెలిపారు. గ్రామ అభివృద్ధికి ఈ బ్యాంకు మరింత ఉపయుక్తంగా నిలుస్తుందన్నారు.

Leave a Reply