Maoist Protest :  మన్యంలో అలజడి

Maoist Protest :  మన్యంలో అలజడి

  • ఎన్​ కౌంటర్లకు వ్యతిరేకంగా..
  • దేశవ్యాప్త నిరసనకు  మావోస్టుల పిలుపు
  • – పోలీసులు అప్రమత్తం
  • – వాహనాల  తనిఖీల్లో  బిజీబిజీ 
  • – రాత్రివేళ   దారి మళ్ళింపు
  • – ఏసీటీవో సరిహద్దుల్లో కూంబింగ్‌ ముమ్మరం

ఆంధ్రప్రభ ,  చింతూరు, (ఏఎస్‌ఆర్‌ జిల్లా)

 అల్లూరి సీతారామరాజు జిల్లా సరిహద్దుల్లోని ఆంధ్రా, చత్తీస్ గడ్‌, తెలంగాణ, ఒడిశా  రాష్ట్రాల్లోని దండకారణ్యంలో అలజడి (Agitate Atmosphear) వాతావరణం నెలకొంది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్‌ కగార్‌లో  ఏపీ ఆపరేషన్‌ సంభవ్‌  (Operation Sambhav)  పేరుతో అల్లూరి జిల్లా రంప చోడవరం పోలీస్‌ సబ్‌ డివిజన్‌ పరిధిలోని మారేడుమిల్లి మండల అడవుల్లో రెండు భారీ ఎన్‌కౌంటర్లు జరిగాయి.

Maoist Protest

ఈ రెండు ఎన్‌కౌంటర్లలో కేంద్ర కమిటీ సభ్యుడు మావోయిస్ట్‌ కీలక నేత రూ. 1 కోటీ 80 లక్షల రివార్డ్‌ ఉన్న (Madvi Hidma) మాడ్వి హిడ్మాతో పాటు ఆయన సతిమణి (Wife Raje)  రాజేలను పోలీసులు మట్టుబెట్టారు. అంతేకాకుండా ఈ ఎన్‌కౌంటర్లో మరో 11 మంది మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. మారేడుమిల్లి మండల అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌ బూటకమని పేర్కోంటూ  మావోయిస్ట్‌ అధికార ప్రతినిధి అభయ్‌ (Maiost party Spokes Person ) పేరుతో లేఖను సైతం విడుదల చేస్తూ నేడు మావోయిస్టులు నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు.

Maoist Protest

మావోయిస్టులు   ఆదివారం దేశవ్యాప్త నిరసనకు పిలుపునిస్తూ- మావోయిస్టు పార్టీ ప్రకటించింది. ఈ మేరకు పార్టీ కేంద్ర అధికార ప్రతినిధి అభయ్‌ (Abhay) పేరుతో ఒక ప్రకటన విడుదలైంది. దేశవ్యాప్త నిరసనను విజయవంతం చేయాలని పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు పిలుపునిచ్చింది.

  Maoist Protest : పోలీసులు విస్కృత తనిఖీలు

Maoist Protest

మావోయిస్ట్‌ పార్టీ దేశవ్యాప్త నిరసనకు పిలుపునిచ్చిన నేపధ్యంలో అల్లూరి జిల్లా పోలీసులు (Polce Alerted)  అప్రమత్తమయ్యారు. ఈ నేపధ్యంలోనే ఆంధ్రా, చత్తీష్‌ఘడ్‌, తెలంగాణ, ఒరిస్సా (ఏసీటీవో) రాష్ట్రాల సరిహద్దుల్లోని ఏజేన్సీ ప్రాంతాల్లోని అడవుల్లో స్పెషల్‌ పార్టీ, సీఆర్పీఎఫ్‌, ఏఎన్‌ఎస్‌, గ్రేహౌండ్స్‌, భద్రతా బలగాలు భారీగా మొహరించి కూంబింగ్‌ (Cumbing)  చేపట్టాయి.

 పోలీస్‌ బలగాలు అప్రమత్తై సరిహద్దుల్లో పహారా కాస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. చత్తీష్‌ఘడ్‌ రాష్ట్రంలో డీఆర్‌జీ, ఎస్టీఎఫ్‌, చత్తీస్​ గడ్‌ పోలీసులు, సీఆర్పీఎఫ్‌ జవాన్లు, తెలంగాణ రాష్ట్ర సరిహద్దులో సీఆర్పీఎఫ్‌, స్పెషల్‌ పార్టీ పోలీసులు, సివిల్‌ పోలీసులు, ఒరిస్సా రాష్ట్ర సరిహద్దులో ఒరిస్సా పోలీసులు, సీఆర్పీఎఫ్‌ భద్రతా బలగాలు, భద్రతా దళాలు రంగంలోకి దిగి దండకారణ్యాన్ని జల్లెడ పడుతున్నట్లు తెలుస్తోంది.

Maoist Protest : రాత్రివేళల్లో వాహనాలు దారి మళ్ళింపు  

Maoist Protest

మావోయిస్ట్‌ పార్టీ   ఆదివారం (Sunday)  నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడంతో చింతూరు సబ్‌ డివిజన్‌ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ తరుణంలో శనివారం ఉదయం నుండి ఆయా పోలీస్‌ స్టేషన్ల పరిధిలో విస్కృతంగా వాహన తనిఖీలు (Vehicles Check)  చేపట్టి వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయడంతో పాటు కొత్త వ్యక్తులు ఏవరైనా కనిపిస్తే వివరాలను ఆరా తీస్తున్నారు. ఇది ఇలా ఉంటే శనివారం సాయంత్రం 5 గంటల నుండి చింతూరు, ఎటపాక సర్కిల్‌ పరిధిలోని చట్టీ- కూనవరం, నెల్లపాకల జంక్షన్‌ల వద్ద చింతూరు, ఎటపాక పోలీసులు ఉదయం 6 గంటల వరకు వచ్చే పోయే వాహనాలను రూట్‌ మార్చి (Root changed)  వయా కూనవరం వెళ్ళే విధంగా దారి మళ్ళించేలా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు

Leave a Reply