TRANSFORMER | ప్రమాదకరంగా ట్రాన్స్‌ఫార్మర్

TRANSFORMER | ప్రమాదకరంగా ట్రాన్స్‌ఫార్మర్

TRANSFORMER |సదాశివనగర్, ఆంధ్రప్రభ : సదాశివనగర్ మండల కేంద్రంలోని పెద్దమ్మ ఆలయం సమీపంలో ట్రాన్స్‌ఫార్మర్ ప్రమాదకరంగా ఉంది. ట్రాన్స్‌ఫార్మర్ దారి పక్కనే ఉండడంతో వరి ధాన్యంతో వెళ్లే లారీలకు తగులుతుందని రైతులు తెలిపారు. లారీపై వెళ్తున్న ధాన్యం సంచులు ట్రాన్స్‌ఫార్మర్ కు తగిలి తీగలు తెగిపోతున్నాయని, దీంతో తరచూ విద్యుత్ (Electricity) సమస్యలు తలెత్తుతున్నాయని, వ్యవసాయ పనులు కొనసాగింపునకు ఇబ్బందికరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు ట్రాన్స్‌ఫార్మర్ ను దారికి దూరంగా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు

Leave a Reply