FIRE | అగ్నిప్రమాదాలపై అవగాహన

FIRE | అగ్నిప్రమాదాలపై అవగాహన

FIRE | ఇల్లెందు, ఆంధ్రప్రభ : ఆర్యవైశ్య మండల, పట్టణ మహాసభ ఆధ్వర్యంలో ఆమ్ బజార్ పటేల్ చౌక్ సెంటర్ లో అగ్ని ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అగ్ని ప్రమాదాలు (Fire Hazards) చిన్న చిన్న పొరపాట్లు వల్ల జరుగుతాయని, నష్టం త్రీవంగా ఉంటుందని ఫైర్ స్టేషన్ అధికారులు వెల్లడించారు.

ఇటీవల ఎక్కువగా గ్యాస్ లేకేజి (Gas Leakage) వల్ల జరుగుతున్నాయన్నారు. గ్యాస్ లీకైనప్పుడు బయటపడకుండా చిన్న చిన్న మెళుకువలు పాటిస్తే పెను ప్రమాదాలు జరగకుండా నివారించవచ్చన్నారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న డి ఎస్ పి చంద్రభాను మాట్లాడుతూ… ప్రధానంగా వ్యాపార కూడలిలో ఉంటున్న వారు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

గ్యాస్ లీకైనప్పుడు తడి గుడ్డ, ప్లాస్టిక్ బకెట్ ఉపయోగించి గ్యాస్ లీక్ ను ఎలా ఆపవచ్చనేది అర్థమయ్యేలా ఫైర్ స్టేషన్ (Fire Station) అధికారులు చూపించడం అభినందనీయమని, ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని కోరారు. ఆర్యవైశ్య మహాసభ పట్టణ, మండల అధ్యక్షులు పొద్దుటూరి నాగేశ్వరావు, అర్వపల్లి రాధాకృష్ణ, సభ్యులు, వ్యాపారులు పాల్గొన్నారు.

Leave a Reply