Kurnool | వేసవికి ముందస్తు చర్యలు

Kurnool | వేసవికి ముందస్తు చర్యలు
జిల్లా కలెక్టర్ డా. సిరి
Kurnool | కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : వేసవి కాలంలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందుగానే సమగ్ర ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి (Dr. A.Siri) ఆదేశించారు. ఆదోని మండలం 104 బసాపురం గ్రామంలోని సమ్మర్ స్టోరేజ్ (ఎస్.ఎస్.) ట్యాంక్‌లో జరుగుతున్న మరమ్మతులు మరియు నీటి నిల్వ సామర్థ్యాన్ని మంగళవారం కలెక్టర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ (Collector) మాట్లాడుతూ… ఎస్.ఎస్. ట్యాంక్‌కు సంబంధించిన అన్ని మరమ్మతు పనులను నవంబర్ నెలాఖరుకల్లా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. అలాగే డిసెంబర్ చివరి నాటికి ట్యాంక్ పూర్తి సామర్థ్యంతో నీటిని నిల్వ చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం బసాపురం ఎస్.ఎస్. ట్యాంక్ 3,110 మిలియన్ లీటర్ల నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం కలిగి ఉన్నప్పటికీ, ప్రస్తుతం కేవలం 20 శాతం మాత్రమే నీరు ఉన్నట్లు అధికారులు కలెక్టర్‌కు వివరించారు. రాబోయే వేసవిలో గ్రామ ప్రజలకు తాగునీటి కొరత రాకుండా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికతో ముందస్తు చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను జిల్లా కలెక్టర్ దిశానిర్దేశం చేశారు.

ఈ కార్యక్రమంలో ఇంచార్జి సబ్ కలెక్టర్ అజయ్ కుమార్, తహసీల్దార్ రమేష్, మున్సిపల్ కమిషనర్ కమిషనర్ నాసిర్ ఉసేన్, మున్సిపల్ డిప్యూటీ ఇంజినీర్లు వెంకట చలపతి, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
