FARMER | అన్నదాతలకు గుడ్ న్యూస్

FARMER | అన్నదాతలకు గుడ్ న్యూస్
రేపు రైతుల ఖాతాలో అన్నదాత సుఖీభవ నిధులు
FARMER | తిరుపతి ప్రతినిధి (ఆంధ్రప్రభ): అన్నదాత సుఖీభవ పథకం రెండవ విడత నగదు బుధవారం జమ చేయనున్నట్లు కలెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. అన్నదాత సుఖీభవ పథకం అమలుపై మంగళవారం కలెక్టర్ వెంకటేశ్వర్ జిల్లాలోని సంబంధిత అధికారులతో టెలీ కాన్ఫెరెన్స్ (Teleconference) నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాకు సంబంధించి అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ నగదు జమకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని తెలిపారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chief Minister Chandrababu Naidu) వ్యవసాయశాఖ మంత్రి, ప్రధాన కార్యదర్శి రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లు, వ్యవసాయ, రెవిన్యూ శాఖ అధికారులతో నిర్వహించిన టెలీ కాన్ఫెరెన్స్ లో స్పష్టమైన సూచనలు జారీ చేశారన్నారు. దేశ వ్యాప్తంగా పీఎం కిసాన్ నగదు జమ కార్యక్రమాన్ని భారత ప్రధాన మంత్రి ప్రారంభించనున్నారని ఇందులో భాగంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రంలోగల అర్హత గల రైతుల ఖాతాలకు అన్నదాత సుఖీభవ పథకం రెండవ విడత రూ. 20 వేలు నగదు జమ కార్యక్రమాన్ని కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం నుండి ప్రారంభించ నున్నారని తెలిపారు.
రైతు సేవ కేంద్రాల్లో వీక్షణకు ఏర్పాట్లు
ఈ కార్యక్రమాన్ని అన్ని రైతు సేవా కేంద్రాల్లో రైతులు వీక్షించే విధంగా తహసీల్దార్లు (Thasildars) వ్యవసాయ శాఖ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలనీ, ప్రతి నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల సమక్షంలో లబ్దిదారులు అందరూ కార్యక్రమానికి హాజరు అయ్యేలా ఆర్డీవోలు, వ్యవసాయ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. రైతులకు ప్రభుత్వం అందించే పథకాల లబ్ధిని తెలిపే విధంగా పాంప్లేట్లను ఈ కార్యక్రమంలో పాల్గొనే రైతుల అందరికీ అందించాలని అన్నారు.
ధాన్యం సేకరణ పై రైతులకు అవగాహన కల్పించాలని, ఏ వరి రకాలను ప్రభుత్వం రైతుల నుండి కొనుగోలు చేస్తుందో తెలపాలని, మార్కెట్ ఎం.ఎస్.పి ల కంటే తక్కువ ధరకు రైతులు (Farmers) అమ్మవలసిన అవసరం లేదనీ అలాంటి పరిస్థితులు ఉంటే రైతుల నుండి ప్రభుత్వం కొనుగోలు చేస్తుందనే సమాచారాన్ని, అవగాహనను వ్యవసాయ అధికారులు కల్పించాలని అన్నారు.
జిల్లాలో సమృద్ధిగా యూరియా
జిల్లాలో యూరియా సమృద్ధిగా ఉందని, ఇప్పటి వరకు 12,000 మెట్రిక్ టన్నులు సేల్, ఇంకా 8,000 మెట్రిక్ టన్నులు స్టాక్లో ఉన్నాయని ప్రతి ఎకరాకు కనీసం 3 యూరియా బస్తాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రైతుల్లో అపోహలను నివారించేందుకు వ్యవసాయ శాఖ , రెవెన్యూ శాఖ లు (Department Of Revenue) క్షేత్రస్థాయిలో స్పష్టమైన సమాచారాన్ని అందించాలని తెలిపారు. అన్నదాత సుఖీభవ పథకం కార్యక్రమానికి తాహసీల్దార్లు, ఆర్డీవోలు, వ్యవసాయ అధికారులు, వీఆర్వోలు, వీఆర్ఏలు, తప్పనిసరిగా హాజరు కావాలన్నారు.
పీఎం కిసాన్/అన్నదాత సుఖీభవ నిధులు అందని వారు, బ్యాంక్ లేదా ఎన్పీసీఐ లింకింగ్ సమస్యలు ఉన్నవారికి సహాయం చేసేందుకు ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయబడుతుందని, రైతులకు ప్యాడీ ప్రొక్యూర్మెంట్, కనీస మద్దతు ధర, రబీ మార్గదర్శకాలు, పంట రకాలు, డ్రోన్ టెక్నాలజీ (Drone Technology) నేచురల్ ఫార్మింగ్ వంటి అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. ఈ టెలీ కాన్ఫెరెన్స్ కు సంబంధిత అధికారులు హాజరయ్యారు.
