– Anna Datha : మిల్లర్ల దగ్గరకు వెళ్లొద్దు

– Anna Datha : మిల్లర్ల దగ్గరకు వెళ్లొద్దు
- 19న అన్నదాత సుఖీభవ..
- – మహిళలు ఆర్థికంగా బలపడాలి
- – ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు
పాలకోడేరు (భీమవరం), ఆంధ్రప్రభ:
రైతుల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని ఏపీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణంరాజు (Ap Deputy Speeker) అన్నారు. పాలకోడేరు మండలం గరగపర్రు (Gragaparru) లో రైతు సేవా కేంద్రంలోని ధాన్యం (Paddy Porcure Centre) కొనుగోలు కేంద్రాన్ని రఘురామకృష్ణంరాజు ( Raghu Rama Krishm Raju) సోమవారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ రైతుల ధాన్యం అమ్ముకోవడానికి మిల్లర్ల (Millers) వద్దకు వెళ్లాల్సిన పని లేదు అన్నారు. ధాన్యం శాంపిల్స్ (Samples) ను రైతు సేవ కేంద్రం తీసుకువచ్చి పరీక్షించుకొని నేరుగా విక్రయించుకోవచ్చు అన్నారు. రైతు ఖాతాలో 24 గంటల్లో నగదు జమవుతుందని తెలిపారు. రైతుకు అన్నదాత సుఖీభవ పథకంలో భాగంగా ఈనెల 19న రైతులు ఖాతాల్లో (Anna Datha ) రూ.7,000 నగదు జమవుతుందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీలు నెరవేర్చే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandra Babu) అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారన్నారు. అనంతరం ధాన్యం లోడు లారీని ప్రారంభించారు.
—–
Anna Dathaమహిళలు ఆర్థికంగా బలపడాలి
ప్రతి మహిళ ప్రభుత్వం అందిస్తున్న పథకాలను, రుణాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా బలపడాలని ఏపీ డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణంరాజు సూచించారు. స్వయం సహాయక సంఘాల (Self Help Groups) మహిళలకు స్త్రీ నిధి (Stri Nidhi) , బ్యాంకు లింకేజీ రుణాల (Bank Linkage Loas) పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని సంఘాలకు రూ. 1.85 కోట్ల విలువైన రుణాలకు సంబంధించిన నమూనా చెక్కులను అందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇస్తున్న రుణాలను ప్రతి ఒక్కరు తమ వ్యాపారాల అభివృద్ధికి, నూతన ఉత్పత్తుల తయారీకి ఉపయోగించాలన్నారు. ఎవరికివారు స్వశక్తిపై నిలబడి ఆదర్శంగా నిలవాలన్నారు. ఈ కార్యక్రమంలో డెల్టా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ మురళీకృష్ణంరాజు, పాలకోడేరు సహకార సంఘం చైర్మన్ కొత్తపల్లి నాగరాజు, పాలకోడేరు మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మోగల్లు బాబు, గరగపర్రు గ్రామ పార్టీ అధ్యక్షులు ఇందుకూరి బలరామ కృష్ణంరాజు, జిల్లా వ్యవసాయ వ్యవసాయ అధికారి జెడ్ వెంకటేశ్వరరావు, డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ వేణుగోపాలరావు, ఏవో సంధ్య, ఏపిఎం భారతి, సీసీలు వరలక్ష్మి, సుజాత , నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
