Telangana | గిరిజన పాఠశాలను ఆకస్మిక తనిఖీ

Telangana | గిరిజన పాఠశాలను ఆకస్మిక తనిఖీ
Telangana | దండేపల్లి, ఆంధ్రప్రభ : దండేపల్లి మండలంలోని దమ్మన్నపేట ప్రభుత్వ గిరిజన పాఠశాలను ఈ రోజు సహాయ గిరిజన సంక్షేమ అధికారి సురేష్(Suresh) ఆకస్మి తనిఖీ చేశారు.
ఉపాధ్యాయ హాజరు పట్టికలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు మెరుగైన విద్యను ఎప్పటికప్పుడు అందించాలని సూచించారు. నాణ్యమైన విద్యతో పాటు, నాణ్యమైన భోజనం కూడా అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ సి ఆర్ పి రఘునాథం, హరిశ్చందర్ పాల్గొన్నారు.
