Jagityala | మానసిక పరిస్థితి బాగాలేక….
Jagityala | గొల్లపల్లి, ఆంధ్రప్రభ : జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రంగదాముని పల్లి గ్రామానికి చెందిన ఈర్తి హనుమంతు(Eerthi Hanuman)(47) అనే వ్యక్తి ఈ రోజు ఉదయం ఉరివేసుకొని మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
కొన్ని సంవత్సరాల నుంచి ఆరోగ్యం బాగా లేనందున మానసిక పరిస్థితి(mental condition) బాగలేక రంగదాంపల్లి గ్రామ శివారులో గల మామిడి చెట్టుకు ఉరివేసుకొని మరణించాడని మృతుని భార్య ఈర్తి మల్లవ్వ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గొల్లపల్లి హెడ్ కానిస్టేబుల్ V. వెంకటేశం(Head Constable V. Venkatesam) కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

