childrens | ఘనంగా బాలల దినోత్సవం

childrens | శావల్యాపురం, ఆంధ్రప్రభ : పల్నాడు జిల్లా శావల్యాపురం మండలంలోని కారుమంచి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల (మెయిన్)లో శుక్రవారం బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులు షేక్ యాకోబు ఆధ్వర్యంలో చిన్నారులు జవహర్‌లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా హెచ్ఎం మాట్లాడుతూ భారత తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జయంతిని బాలల దినోత్సవంగా నిర్వహిస్తారని తెలియజేశారు. అనంతరం చిన్నారులకు బిస్కెట్లు, చాక్లెట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో విద్యా కమిటీ చైర్మన్ ఆడుసుమల్లి వెంకట నరసింహారావు, ఉపాధ్యాయులు గోరంట్ల విజయకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply