Nalgonda | సొంత నిధులతో…
Nalgonda | చౌటుప్పల్, ఆంధ్రప్రభ : చౌటుప్పల్ మండలంలోని వలిగొండ రోడ్డులో ఉన్న శ్రీ బాలాజీ రామకృష్ణ దేవాలయంలో అయ్యప్ప స్వాములు, భక్తుల సౌకర్యార్థం చౌటుప్పల్ పట్టణ కాంగ్రెస్ నాయకులు బత్తుల విప్లవ్ కుమార్ గౌడ్ తన సొంత నిధులతో వేయించిన బోర్ ను ఈ రోజు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Rajagopal Reddy) ప్రారంభించారు.
సొంత నిధులతో బోర్ వేయించిన విప్లవ కుమార్ గౌడ్ ను ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మునుగోడు నియోజకవర్గ ఎన్నికల ఇంచార్జ్ పబ్బు రాజు గౌడ్(charge Pabbu Raju Goud), పార్టీ మండల అధ్యక్షులు బోయ దేవేందర్, మున్సిపల్ అధ్యక్షులు సుర్వి నర్సింహా గౌడ్, మొగుదల రమేష్ గౌడ్, తోర్పునూరి నర్సింహా, సందగళ్ళ సతీష్, పాక చిరంజీవి యాదవ్, తోర్పునూరి రవి, చెరుకు అశోక్, కళ్లెం నాగరాజు, చెవగొని మహేశ్ తదితరులు పాల్గొన్నారు.

