PACS | కోడూరు, ఆంధ్రప్రభ : కోడూరు పీఏసీఎస్ వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు మండల వ్యవసాయ అధికారి ఎం.శ్రీధర్ తెలిపారు. గురువారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అవనిగడ్డ జనసేన యువ నాయకులు మండలి వెంకట్రామ్ పరిశీలించారు. ఈ సందర్భంగా 100 కేజీల ధాన్యం రూ.2,389, 75 కేజీల (గ్రేట్ వన్) ధాన్యం బస్తా రూ.1792 ధరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. పీఏసీఎస్ అధ్యక్షులు పూతబోయిన కరుణకుమార్, సెక్రటరీ అరజా నగరాయిలు, స్థానిక పార్టీ నేతలు పాల్గొన్నారు.
PACS | ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

