Manthani : యువ‌త క్రీడ‌ల్లో రాణించాలి…

Manthani : యువ‌త క్రీడ‌ల్లో రాణించాలి…

మంథని, ఆంధ్ర‌ప్ర‌భ : కాంగ్రెస్ ప్రభుత్వంలోనే క్రీడల అభివృద్ధి జరిగిందని మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) పేర్కొన్నారు. ఈ రోజు మంథని(Manthani) పట్టణంలో తెలంగాణ ఐటి, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు రూ. 44 లక్షలతో బ్యాట్మెంటన్ కోర్టు ప్రారంభించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ…. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే క్రీడలకు ప్రోత్సాహం దక్కిందన్నారు. యువత ఆటలతో పాటు చదువులో రాణించాలని పేర్కొన్నారు. తెలంగాణ క్రీడాకారులు దేశవ్యాప్తంగా రాణించాలని సూచించారు. ప్రభుత్వంలో క్రీడాకారుల కోసం ప్రత్యేక సంక్షేమ పథకాలు రూపొందించడం జరుగుతుందని తెలిపారు. టెన్నిస్ కోర్ట్(Tennis Court) వద్ద ఏర్పాటు చేసిన ప్లడ్ లైట్లు(Flood lights) ఆన్ చేసి క్రీడాకారులతో టెన్నిస్ ఆట ఆడి ప్రారంభించారు.

అనంతరం మంత్రి శ్రీధర్ బాబు, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష(District Collector Koya Sriharsha)లను వ్యాయామ ఉపాధ్యాయులు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో మంథని ఆర్డీవో సురేష్, మంథని తాసిల్దార్ కుమారస్వామి, మున్సిపల్ కమిషనర్ వెంకన్న, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుదల వెంకన్న, సింగిల్విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్(Kotha Srinivas), మంథని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయిలి ప్రసాద్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply