దిష్టిబొమ్మ దగ్ధం…

దిష్టిబొమ్మ దగ్ధం…
పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : దేశ రాజధాని ఢిల్లీలో బాంబు పేలుళ్లు, ఉగ్రవాదుల కుట్రలను నిరసిస్తూ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఈ రోజు బీజేపీ నాయకులు(BJP leaders) ఆందోళన చేపట్టారు. కమాన్ చౌరస్తా వద్ద రాజీవ్ రహదారిపై రాస్తారోకో(write) నిర్వహించి ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఉగ్రదాడులను సహించేది లేదని నినదించారు. ఉగ్ర చర్యలను ప్రతీ భారతీయుడు ఖండించాలని నాయకులు అన్నారు. బీజేపీ పెద్దపల్లి పట్టణ(Peddapally town) అధ్యక్షుడు పెంజర్ల రాకేష్(Peddapally town) ఆద్వర్యంలో నిర్వహించిన ఆందోళనలో నాయకులు శిలారపు పర్వతాలు యాదవ్(Shilarapu Parvata Yadav), తంగెడ రాజేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.
