Kavali | కారు బోల్తా … 11 మందికి గాయాలు
కావలి మండలం రుద్రకోట జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. తిరుమల నుంచి వస్తున్న భక్తుల కారు పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో 11మందికి గాయాలు అయ్యాయి. నరసరావుపేటకు చెందిన 11 మంది తిరుమల శ్రీవారి దర్శనం కోసం సోమవారం కారులో తిరుమలకు చేరుకున్నారు. స్వామివారిని దర్శనం అనంతరం తిరుగు ప్రయాణమయ్యారు.
మంగళవారం తెల్లవారుజామున రుద్రకోట వద్ద ప్రమాదానికి గురైంది. అందరూ నిద్రలో ఉండగా ప్రమాదవశాత్తూ కారు బోల్తా కొట్టింది. గాయపడిన వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు.