బిగ్ బ్రేకింగ్ – విశాఖలో స్వల్ప భూకంపం..

బిగ్ బ్రేకింగ్ – విశాఖలో స్వల్ప భూకంపం..

విశాఖపట్నంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం తెల్లవారుజామున భూమి స్వల్పంగా కంపించింది. ఆరిలోవ, అడవివరం, మాధవధార, అక్కయ్యపాలెం, హెచ్బీ కాలనీ, అల్లపురం, ఎండాడ, భీమిలి, పెందుర్తిలో భూమి కంపించింది. తెల్లవారుజామున 4 గంటల 18 నిమిషాలకు స్వల్ప భూప్రకంపనలు వచ్చాయి. అయితే.. పెద్ద శబ్దంతో భీమిలి బీచ్ రోడ్ లో భూమి కంపించింది. అలాగే సింహాచలంలోనూ స్పల్పంగా కంపించింది. దీంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంప తీవ్రత 3.7 గా నమోదైంది.

Leave a Reply