చేవెళ్ల ప్రమాదంపై రాష్ట్రపతి సంతాపం

చేవెళ్ల ప్రమాదంపై రాష్ట్రపతి సంతాపం

ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Draupadi Murmu) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో అనేక మంది ప్రాణాలు కోల్పోవడం అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, వారి కుటుంబాలకు దేవుడు ధైర్యం ఇవ్వాలని ఆమె ప్రార్థించారు. అలాగే ఈ ఘటనలో గాయపడిన ప్రయాణికులు త్వరగా కోలుకోవాలని రాష్ట్రపతి ఆకాంక్షించారు. ఇలాంటి విషాద ఘటనలు మరల జరగకూడదని ఆమె అన్నారు.

Leave a Reply