కర్ణాటక ఈశా టెంపుల్లో జగన్ అభిమాని పూజలు
హిందూపురం అక్టోబర్ 20 (ఆంధ్రప్రభ) మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 2029 ఎన్నికల్లో మళ్లీ సీఎంగా చూడాలని కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం లక్ష్మమ్మరీ గ్రామానికి చెందిన జగన్మోహన్ రెడ్డి వీరాభిమాని సంగటి సురేష్ కర్ణాటక ప్రాంతమైన చిక్బల్లాపురం (ఈశా టెంపుల్ )నందీశ్వర ఆలయం లో ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక్కడ పూజలు చేస్తే తప్పకుండా నెరవేరుతాయి అన్న ఉద్దేశంతో అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగిందని పేర్కొన్నారు. అదేవిధంగా భవిష్యత్తులో పాదయాత్ర కూడా తాను చేస్తున్నట్లు కూడా తెలిపారు. జగన్మోహన్ రెడ్డి 2029లో సీఎం కావాలి రాష్ట్రం బాగుండాలన్న ఉద్దేశమే తన లక్ష్యం అన్నారు.