తగిన జాగ్రత్తలు పాటించాలి..
చేవెళ్ల, ఆంధ్రప్రభ : ప్రతి ఇంట దివ్య వెలుగుల దీపాలు వెలగాలని చేవెళ్ల పీఎసిఎస్ చైర్మన్ దేవర వెంకటరెడ్డి(Devara Venkata Reddy) అన్నారు. దీపావళి పర్వదినం పురస్కరించుకొని పిఎసిఎస్ చేవెళ్ల బ్యాంక్ కార్యాలయంలో సతీసమేతంగా లక్ష్మీ పూజ నిర్వహించారు. వేద బ్రాహ్మణుల మంత్రోచ్ఛరణలతో పూజ గావించారు. సిబ్బందికి, రైతులకు, బ్యాంకు ఖాతాదారులకు ఆయన దీపావళి శుభాకాంక్షలు తెలియజేసి, స్వీట్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా పిఎసి చైర్మన్ దేవర వెంకటరెడ్డి మాట్లాడుతూ.. చెడుపై మంచి సాధించిన విజయంగా దీపావళి పర్వదినంను జరుపుకోవడం ఆనవాయితీ అని చెప్పారు. రైతుల, బ్యాంకు ఖాతాదారుల(bank account holders) కుటుంబాల్లో సంతోషం, సౌభాగ్యం, ఐశ్వర్యం వెల్లివిరియాలని ఆయన ఆకాంక్షించారు.
టపాసులు కాల్చే సమయంలో జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో డిసిసి ఉపాధ్యక్షులు బండారు ఆగిరెడ్డి(Bandaru Aagi Reddy) చేవెళ్ల మాజీ ఉపసర్పంచ్ టి. శ్రీనివాస్ యాదవ్, బ్యాంక్ సీఈవో వెంకటయ్య, డైరెక్టర్ పి మధుసూదన్ రెడ్డి, సిబ్బంది ధనలక్ష్మి, రమేష్, కృష్ణమూర్తి, అశోక్ రెడ్డి, యాదయ్య, నర్సింలు, యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు మద్దెల శ్రీనివాస్, నాయకులు చెన్నారెడ్డి తదితరులున్నారు.

