కౌంట్‌డైన్ స్టార్ చేసిన మేకర్స్ !
హను రాఘవపూడి–ప్రభాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఫౌజీ’. ఈ సినిమాపై డార్లింగ్ ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి సంబంధించి దీపావళి సందర్భంగా మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు.
ఓ పోస్టర్ ను రిలీజ్ చేస్తూ… ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అక్టోబర్ 22న ఈ సినిమా టీజర్ లేదా ట్రైలర్ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అదే సందర్భంలో “DECRYPTION BEGINS ON 22.10.25 🔥” అంటూ ఒక పవర్‌ఫుల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
అదే పోస్టర్‌లో ప్రభాస్ వెనుకభాగం మాత్రమే కనిపిస్తూ, ఆయుధాలతో నిండిన సిల్హౌట్ షాట్‌లో ప్రభాస్ ఒంటరిగా నిలబడి ఉన్నారు. దానిపై “A Battalion who Stands Alone” అనే ట్యాగ్‌లైన్ రాసి ఉంది. ఇది ఫ్యాన్స్‌లో ఆసక్తిని మరింత రెట్టింపు చేసింది.
అదేవిధంగా, పోస్టర్‌లో మరో ఆసక్తికరమైన అంశం కనిపించింది. సంస్కృత వాక్యం “पद्मव्यूह विजयी पार्थः” (Padmavyūha Vijayī Pārthaḥ). దీని అర్థం “పద్మవ్యుహాన్ని జయించిన పార్థుడు (అర్జునుడు)”. ఈ శ్లోకానికి సినిమాకి ఏం కనెక్షన్ ఉంటుందా అని అభిమానులు డీకోడింగ్ మోడ్‌లోకి వెళ్లిపోయారు. దీంతో సోషల్ మీడియాలో #PrabhasHanu, #Fauji హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండ్ అవుతున్నాయి.

