మునుగోడు, ఆంధ్రప్రభ : రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల్లో ప్రతిభ కనబరిచిన మునుగోడు మహాత్మ జ్యోతిభా పూలే బాలికల రెసిడెన్షియల్ పాఠశాల ఎనిమిదో తరగతి విద్యార్థిని పి.వైష్ణవి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైంది.
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మైత్రి గ్రౌండ్ లో జరిగిన ఎస్జీఎఫ్ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలలో అండర్-14 పోటీల్లో ఆ బాలిక ప్రతిభ కనబరిచి ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సంధ్య తెలిపారు.
ఉత్తమ ప్రతిభ కనపరచడానికి సహకరించిన పీఈటీ నాగమణి, విజయ లను, అలాగే జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైన విద్యార్థిని పి.వైష్ణవి లను ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయులు అభినందించారు.ఉమ్మడి నల్గొండ జిల్లా జట్టు కబడ్డీ పోటీలలో అద్భుత ప్రదర్శనతో తృతీయ స్థానంలో నిలిచినట్లు పేర్కొన్నారు.
