లైసెన్స్ పొంది బాణాసంచ సామాగ్రి అమ్మాలి
భూపాలపల్లి జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : ఎటువంటి అనుమతి లేకుండా బాణాసంచ సామాగ్రి విక్రయించొద్దని, లైసెన్స్ లేకుండా విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖారే (SP Kiran Khare) హెచ్చరించారు. దీపావళి పండుగ నేపథ్యంలో జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే ఈ రోజు జిల్లా కేంద్రంలోని దీపావళి సామాన్లు విక్రయించే షాపులను పర్యవేక్షించారు.
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనం రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలు, ట్రాఫిక్ బిజీ ఏరియా, విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్‌ల (Electrical transformers) పక్కన, పెట్రోల్ బంకుల సమీపాన షాపులు ఏర్పాటు చేయొద్దని సూచించారు. తహసిల్దార్, ఫైర్ సర్వీస్, పోలీస్ శాఖ సూచించిన ప్రదేశాల్లో మాత్రమే లైసెన్స్ ఉన్న వ్యాపారులువిక్రయించాలని, భద్రతా ప్రమాణాలు పాటించకుండా టపాసులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయనతోపాటు డీఎస్పీ సంపత్ రావు, సీఐ నరేష్ కుమార్ తదితరులు ఉన్నారు.

