ఊట్కూర్‌లో బైక్ ర్యాలీ
ఊట్కూర్, అక్టోబర్ 18 (ఆంధ్రప్రభ) : బీసీ రిజర్వేషన్ అమలుకు బీసీ సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన బంద్ నారాయణపేట (NarayanaPet) జిల్లా ఊట్కూర్ మండలంలో సంపూర్ణంగా కొనసాగుతుంది. అధికార కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ ఎస్, సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ప్రజాపంథా, పీ వై ఎల్ తదితర సంఘాల నాయకులు బంద్ (Bandh) లో పాల్గొని మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఊట్కూరు మండల వ్యాప్తంగా పలు వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎస్సై రమేష్ ఆధ్వర్యంలో పోలీసులు గ్రామాల్లో పర్యవేక్షిస్తున్నారు.


